BDK: మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా కరకగూడెంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం గంజాయి నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్ధ రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.