MHBD: గూడూరు మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు ఎంపిక పరీక్ష ఈనెల 13న నిర్వహించనున్నట్లు MEO రవికుమార్ తెలిపారు. హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్, హనుమకొండలోని క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఈనెల 12లోగా https://tgss.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.