TG: HYD జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ MLA షకీల్ కొడుకు రహీల్ కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. రెండేళ్ల కిందట జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం నిందితులు పరారయ్యారు. కారులో షకీల్ కొడుకు రాహిల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు.