AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై స్టాండప్ కమెడియన్ అనుదీప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జనసేన నేత ఫిర్యాదు మేరకు అతడిని కాకినాడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అతడిని కాకినాడ 3వ అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రూ.10 వేల సొంత పూచికత్తుపై అనుదీప్‌కు బెయిల్ మంజూరు చేసింది.