గూగుల్ ప్లేస్టోర్లో ఆధార్ యాప్ డౌన్లోడ్ చేయాలి. ఆధార్ వివరాలు నమోదు చేసి 6 అంకెలతో కూడిన పిన్ సెట్ చేసుకోవాలి. ఫొటోతో కూడిన ఆధార్ కార్డు కనిపిస్తుంది. కింద డౌన్లోడ్, షేర్, బయోమెట్రిక్ లాక్ కనిపిస్తాయి. సర్వీస్ పేజీ తెరవగానే ఫోన్ నెంబర్, అడ్రస్ అప్డేట్ కనిపిస్తాయి. వీటిని ఎంపిక చేసుకుని మార్పులు, చేర్పులను ముఖ ఆధారిత నిర్ధారణ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.