AP: శాసనమండలిలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఘటనల నుంచి ఏం నేర్చుకున్నారని ఎమ్మెల్సీ అరుణ్ ప్రశ్నించారు. డయేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు ఏవీ? నిర్వహణ లోపం వల్లనే డయేరియా ప్రబలుతోందని పేర్కొన్నారు. ప్రతిసారి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.. కానీ, ఏదో ఒక జిల్లాలో ప్రబలుతోందని మండిపడ్డారు.