AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర మ్యాప్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు 28 జిల్లాలతో కూడిన అధికారిక మ్యాప్‌ను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్పష్టంగా పేర్కొంది.