‘బాహుబలి’ షూటింగ్ విశేషాలను అడివి శేష్ గుర్తుచేసుకున్నాడు. ఒక సీన్లో అనుష్కను బలంగా తన్నాలని రాజమౌళి చెప్పడంతో తాను నిజంగానే తన్నానని, దీనివల్ల ఆమె మెడ బెణికినట్లు అనిపించిందని తెలిపాడు. అంత నొప్పి కలిగినా ఆమె కేవలం సీన్ అవుట్పుట్ గురించే ఆలోచించారని, అందుకే అనుష్క పేరుకు తగ్గట్టే ‘స్వీటీ’ అని ఆయన కొనియాడాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.