PPM: చింతలబేలగం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో అధికారులు గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎవరూ పొలాల వైపు వెళ్లకూడదని, అవసరం లేకుండా రోడ్లపై తిరగరాదని హెచ్చరించారు. ఏనుగులు గ్రామాలకు చేరువవుతున్నందున ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.