TG: ఖానాపూర్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. గందరగోళం మధ్య ఈ ఎన్నికను అధికారులు రేపటికి వాయిదా వేశారు. బీజేపీ అభ్యర్థి మౌనికకు ఏడుగురు కౌన్సిలర్ల మద్దతు ఉండటంతో ఛైర్మన్గా ఆమెను ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎన్నిక సమయంలో తమకు ఏడుగురు మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎక్స్అఫీషియో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు.