PDPL: ఈనెల 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కలెక్టర్ ఆదేశం మేరకు వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రవీందర్ ఇవాళ తెలిపారు. పెద్దపల్లిలో ఉదయం 10 గంటలకు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, నాయకులు, మేధావులు, హాజరై విజయవంతం చేయాలని కోరారు.