AP: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని మాజీ MLA వల్లభనేని వంశీ పోలీసులను ఆశ్రయించారు. మాజీమంత్రి పేర్ని నానితో కలిసి కృష్ణా జిల్లా అడిషనల్ SPకి ఆయన ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్న యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానళ్లకు వంశీ లీగల్ నోటీసులు పంపారు.