TG: పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేష్ కుమార్ స్పందించారు. రూ. 8లక్షల కోట్ల అప్పుతో ప్రభుత్వాన్ని BRS తమకు అప్పగించిందని.. వాటి వడ్డీలకే నెలకు రూ.6,500 కోట్ల నుంచి రూ.7వేల కోట్ల వరకు పోతున్నాయన్నారు. పోచారం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలన్నారు. అయితే సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు ప్రభుత్వం నిధులు మంజూరు చేయట్లేదని పోచారం అసహనం వ్యక్తం చేశారు.