AP: పర్యావరణ, జంతు ప్రేమికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. వన్యప్రాణుల నుంచి మనుషులను రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఏనుగుల వల్ల పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు.