AP: మాజీ CM జగన్ సహా YCP నేతలు హత్యా రాజకీయాలు చేస్తున్నారని MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ‘పరిటాల కేసు తిరగదోడితే జగన్ ప్రమేయం బయటపడుతుంది. వివేకా హత్యను గుండెపోటుతో చిత్రీకరించింది ఎవరో తేలాలి. హత్యకేసులో నలుగురు సాక్షులను ఆనవాళ్లు లేకుండా చేశారు. రాష్ట్రంలో అల్లరి సృష్టించడమే వారి లక్ష్యం. జనాన్ని పోగేస్తే తప్ప.. తాడేపల్లి ప్యాలేస్ నుంచి రాలేరు’ అని ఆరోపించారు.