AP: IRR కేసులో మాజీ MLA ఆళ్ల రామకృష్ణ రెడ్డి రేపు ACB కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. CM చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు మూసివేస్తున్నట్లు అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రామకృష్ణా రెడ్డికి కోర్టు నోటీసులు పంపింది. రేపు కోర్టు హాజరుకానున్నారు. అలాగే ప్రొటెస్ట్ పిటిషన్ కూడా వేయనున్నారు. కాగా, ఇటీవల ఆయనకు CID కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.