TG: సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్నారు. పెండింగ్లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను ఆమోదించాలని సీఎం కోరనున్నారు. ప్రొ.కోదండరామ్, అజారుద్దీన్ పేర్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. గవర్నర్ ఆమోదించకుంటే ఈ నెల 30 తర్వాత అజారుద్దీన్ పదవి కోల్పోనున్నారు.