AP: కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కర్ణాటక అధికారులతో సమన్వయం చేసుకోవాలని, బాధిత కుటుంబాలకు తగిన సహాయం చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.