AP: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి ఆయా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించనున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. ఆపై అందుబాటులో ఉన్న కీలక నేతలతో భేటీ కానున్నారు.