TG: కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై BRS నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ మండిపడ్డారు. కోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని, కేవలం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విచారణకు పిలవడంపైనే అభ్యంతరం తెలిపిందని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీశ్ రావు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని, త్వరలోనే వారిని లోపలేస్తామంటూ ఆయన హెచ్చరించారు.