AP: అంతర్వేదిలో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.17.33 కోట్లతో మంచి నీటి పథకాన్ని ప్రారంభించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్ర క్షేత్రంలో తాగునీటి సమస్య ఉండకూడదని అన్నారు. అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ పుణ్యభూమి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో పని చేస్తుందన్నారు.