TG: హెకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా మరమ్మతులు చేయనందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. పీసీ ఘోష్ నివేదిక కాదు.. పీసీసీ నివేదిక అని ఆరోపించారు.