TG: వెయ్యేండ్లయిన BRS మారదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గుంటనక్క నిన్న ఢిల్లీ పోయిందని తీవ్ర విమర్శలు చేశారు. నిన్న సభలో మహిళా రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఉట్టికథలు చెప్పిందని, ప్రభుత్వం పిట్టకథలు చెప్పిందన్నారు. జీవన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులు బిచ్చం ఎత్తుకునే పరిస్థితిలో ఉన్నారన్నారు.