TG: సీఎం రేవంత్ ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన రెండో రోజుకు చేరింది. ఇందులో భాగంగా ఆయన ఇవాళ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, పురోగతిని పరిశీలించనున్నారు. అనంతరం ఉద్దండాపూర్ వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.