TG: రాష్ట్రంలో బాల్య వివాహాలు ఆగడం లేదు. రాష్ట్రంలో సుమారు 5 శాతం అమ్మాయిలు.. అంటే 2.16 లక్షల మంది బాలికలు 18 సంవత్సరాలలోపు వివాహం చేసుకున్నట్లు కుల గణన సర్వేలో అధికారులు గుర్తించారు. ఆర్థికంగా లేదా సామాజికంగా ముందున్న వర్గాల్లో కూడా లింగ అసమానతలు కొనసాగుతున్నాయని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో సగటు మహిళలు, పురుషుల నిష్పత్తి 980:1000గా ఉంది.