TG: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి మృతిచెందిన ఘటనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు DGP శివధర్‌రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నేతలు వినతిపత్రం అందజేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజాలు వెలికితీయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.