AP: రాజధాని అమరావతి పేరు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు ‘Amaravathi’కి బదులుగా ‘Amaravati’ (చివరలో Ti) అని మాత్రమే వాడాలని ఆదేశించింది. అన్ని అధికారిక పత్రాలు, ప్రభుత్వ నోట్స్, రికార్డుల్లో అమరావతి పేరుతోనే ఉండాలని స్పష్టం చేస్తూ జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.