AP: గుంటూరులోని మంగళగిరిలో ఈగల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DGP హరీష్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రీమియర్ ఆర్గనైజేషన్ ఈగల్ ఏర్పాటు చేశాం. NSPS యాక్ట్ ద్వారా డ్రగ్స్‌ను నిరోధిస్తున్నాం. ఇప్పటి వరకు 112 NDPS కేసులు పెట్టాం. డ్రగ్స్ మాఫియా టెర్రరిజంలా తయారైంది. విద్యాసంస్థలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం’ అని అన్నారు.