TG: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని MLCలు మల్క కొమురయ్య, AVN రెడ్డి కోరారు. TPUS యూనియన్ నేతలతో కలిసి సెక్రెటేరియట్లో CSను కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హత కలిగిన DSC -2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానంను తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలు తీసుకోకుండా సమర్పించిన TG విద్యా కమిషన్ నివేదికను తక్షణమే నిలిపివేయాలన్నారు.