ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ విజయాలను గుర్తించడానికి ఇది ఒక ముఖ్యమైన వేదిక. స్త్రీ పురుష సమానత్వం సాధించడం, మహిళల హక్కుల పట్ల అవగాహన కల్పించడమే ఇవాళ్టి ప్రధాన ఉద్ధేశం. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గౌరవిస్తూ, వారిని ప్రోత్సహించడం మనందరి బాధ్యత. మహిళలందరికీ HIT TV తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.