TG: రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకం అమలు కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,080.38కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) గాను ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.