TG: కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. అందులో ఒకటి మేడిగడ్డ అని.. ఆ ప్రాజెక్టుకు రూ. 4వేల కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. కుంగిన రెండు పిల్లర్ల మరమ్మతులకు రూ.400 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. మేడిగడ్డను మరమ్మతులు చేయకుండా.. రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారన్నారు. కరవు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.