AP: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో విశాఖకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి బోర్డు అధికారులకు ఫోన్ చేసి, తనను పాస్ చేయాలని కోరాడు. జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టానని, ఏమీ రాక ప్రశ్నలనే తిరిగి రాశానని చెప్పాడు. స్పందించిన అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే, ఆ విద్యార్థి మొత్తం 5 సబ్జెక్టులు ఫెయిల్ అయినట్లు అధికారులు గుర్తించారు.