AP: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని CM చంద్రబాబు ప్రారంభించారు. గర్బాశయ క్యాన్సర్ రాకుండా బాలికలు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే జీవితాంతం రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా బాలికలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. చీపురుపల్లి CHC పరిశుభ్రంగా ఉందని అధికారులను అభినందించారు.