AP: మాజీ సీఎం జగన్ చెప్పిన ‘మావిగన్’ ప్రతిపాదనపై మంత్రి లోకేష్ ‘X’ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మావిగన్‌లో ‘మా’ అంటే మాయ, ‘వి’ అంటే విధ్వంసం అని లోకేష్ పేర్కొన్నారు. అలాగే, ‘గన్’ అంటే గందరగోళం, గన్ కల్చర్ అని వ్యాఖ్యానించారు. ఇదేనా ‘జగన్ చెప్పిన ప్లాన్ -B?’ అని మంత్రి ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశారు.