AP: డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. కొన్నేళ్లుగా క్లోరినేషన్ జరగలేదని, క్లోరినేషన్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నీళ్ల శాంపిల్స్ ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. తాగునీటి కలుషితం వల్లనే డయేరియా ప్రబలుతోందని వెల్లడించారు. వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానం చెప్పారు.