AP: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. స్త్రీ విద్య కోసం ఉద్యమించి, బాల్య వివాహాలను ఖండించి, వితంతు వివాహాలను ప్రోత్సహించిన ఆయన ధీశాలి అని కొనియాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు స్మరించుకున్నారు. కందుకూరి ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.