AP: CM చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం దాదాపు మూడు గంటలకు పైగా జరిగింది. కార్యదర్శుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ ప్రారంభమైనా అజెండా మంత్రులకు రాలేదని మంత్రి మనోహర్ ప్రస్తావించారు. అజెండా ముందే వస్తే.. స్టడీ చేసుకుని కేబినెట్‌కు వచ్చే వీలు ఉండేదన్నారు. దీంతో వ్యవస్థలు ఉపయోగపడాల్సిందిపోయి.. క్లిష్టంగా మారుతున్నాయని సీఎం అన్నారు.