టైర్లలో గాలి తక్కువైతే.. రోడ్లకు, టైర్లకు మధ్య స్పర్శ విస్తీర్ణం పెరుగుతుంది. ఫలితంగా వాటి మధ్య రాపిడి ఎక్కువై, ఇంధన వినియోగం కూడా అధికమవుతుంది. అలాగని గాలిని మరీ ఎక్కువగా నింపితే ఇంధన వాడకం తగ్గినా.. గ్రిప్పింగ్ సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి వాహన ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఎప్పుడూ టైర్లలో పీడనం.. తయారీ సంస్థ సిఫార్సు చేసిన స్థాయిలో ఉండేలా చూసుకోండి.