TG: నారీ శక్తి వందన్ బిల్లుకు మద్దతుగా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో మహిళలు స్కూటీ ర్యాలీ చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామంచందర్ రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. HYD నారాయణగూడ నుంచి అసెంబ్లీ వరకు ఈ ర్యాలీ సాగుతోంది. ర్యాలీకి రాంచందర్ రావుతో పాటు మహిళ మోర్చా, యువ మోర్చ నాయకులు భారీగా హాజరయ్యారు.