AP: రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, SP, అధికారులతో ఆయన మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను CM ఆదేశించారు. పాలు వాడిన 75 మంది శాంపిల్స్ సేకరించామని అధికారులు తెలిపారు. కల్తీ పాలు అని తేలితే కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు వెంటనే రాజమండ్రికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.