TG: హైదరాబాద్ ORR, PVNR ఎక్స్ప్రెస్ వేలపై బైకులకు అనుమతి లేదు. గూగుల్ మ్యాప్స్ వాడేటప్పుడు వాహనాన్ని సరిగ్గా ఎంచుకోకపోవడంతో చాలామంది నిషేధిత దారుల్లోకి వెళ్లి పోలీసులకు చిక్కుతుంటారు. గమ్యాన్ని ఎంచుకున్నాక కారు లేదా బైక్ చిహ్నాన్ని తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఇలా చేస్తేనే బైకర్లకు అనుమతి ఉన్న మార్గాలను మ్యాప్ చూపిస్తుంది. ఈ జాగ్రత్తతో చలాన్ల నుంచి తప్పించుకోవచ్చు.