AP: గత ఐదేళ్లలో జగన్ మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేసి అరాచక పాలన సాగించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. హార్బర్ల ఎస్టిమేట్లు పెంచి కమీషన్లు దండుకున్నారని, అభివృద్ధి కంటే దోచుకోవడమే ఆయన లక్ష్యమని విమర్శించారు. YCPకి గొడ్డలి గుర్తే సరైనదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.