AP: తాను ఎక్కడా గత ప్రభుత్వాధినేత ప్రమేయం ఉందని చెప్పలేదని, ఆయన నియమించిన బోర్డు హయాంలోనే తప్పు జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తప్పు జరిగిందని ఒప్పుకుని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెబితే సరిపోయేదన్నారు. అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదని వైసీపీ నేతలు చెప్పడమేంటని ప్రశ్నంచారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకే పథకం ప్రకారం కుట్ర జరిగిందని సిట్ తేల్చిందన్నారు.