TG: ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. RTCని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లకు అనుమతి ఇవ్వాలనే డిమాండ్లతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఇవాళ్టితో జేఏసీ గడువు ముగియనుండటంతో సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మె ప్రభావం ప్రజలపై పడకూడదని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.