AP: కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటకకు చెందిన 8 మంది మృతి చెందడం విచారకరమన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.