TG: రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉచిత చీరల పంపిణీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. దీనికోసం కోటి చీరల తయారీకి TESCOకు రూ.450 కోట్ల విలువైన ఆర్డర్‌ను కేటాయించింది. ఈ నిర్ణయంతో అటు మహిళలకు లబ్ధి చేకూరడంతో పాటు, ఇటు చేనేత కార్మికులకు చేతినిండా పని దక్కనుంది. పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేలా అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.