ఒకప్పుడు పల్లెల్లో చల్లటి మట్టి కుండలో దాచిన అంబలి, అవ్వ ప్రేమతో కలిపిన సద్దన్నం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా.. ప్రాణాలకు రక్షణనిచ్చే సంజీవనిలా ఉండేవి. నేడు జీవనశైలి మారడంతో అవే సంప్రదాయ ఆహారాలు సరికొత్త వ్యాపార రూపం దాల్చుతున్నాయి. ఆత్మీయంగా అందించే రాగి జావ, ఇప్పుడు రోడ్ల పక్కన స్టాళ్లలో గ్లాసుల్లో విక్రయిస్తున్నారు.