AP: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని ఇచ్చిన ఈ భరోసా ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూడడమే ఎన్డీయే లక్ష్యమని అన్నారు. ‘ఇది ఎన్డీయే గ్యారెంటీ’ అని లోకేష్ ట్వీట్ చేశారు.