AP: హోంమంత్రి అనిత ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నాతవరంలో నిర్వహించే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం నాతవరం, గొలుగొండ, కేడీ పేట ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు.